ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. 22న సచివాలయ ముట్టడి!

by Ramesh Goud |   ( Updated:2024-02-18 14:38:53.0  )
ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. 22న సచివాలయ ముట్టడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ, అధికార వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తొంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతూ.. ఈ ఐదేళ్లలో అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే గాక ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, పైగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పై మరో దాడికి సిద్దమవుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న సచివాలయం ముట్టడికి సిద్ధమవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. తక్కువ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ.. సచివాలయం ముట్టడి చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సచివాలయ ముట్టడిలో ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Read More..

వీటికి ఎక్కడ సమాధానం చెబుతావు జగన్..?

Advertisement

Next Story