- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది..ఎవరు అధైర్యపడొద్దు’..మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
దిశ,కాకినాడ:భారీ వర్షాల తాకిడికి పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం అదుకుంటుందని టీడీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం పాతర్ల గడ్డ, కొంగోడు, వాకడ, వేములవాడ, పెద్దాపురపాడు తదితర గ్రామాల్లో నీటి మునిగిన పంట పొలాలను పిల్లి దంపతులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలకు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నారు మడులు నీట మునిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాల పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు.
కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయాధికారులు ఆదేశించామని, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు ప్రారంభిస్తారని తెలిపారు. నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు పల్లపు భూములు కావడం వలన నీటమునుగుతున్నాయని కొన్ని గ్రామాల్లో ఆకుమడులు వేసినవి మునిగి ఊడ్చేయడానికి పనికి రాకుండా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో వెదజల్లిన నారుమడులు ఉన్నాయని రెండుమూడు రోజుల్లో నీరు తగ్గిన తర్వాత దాని నష్టాన్ని అంచనా వేస్తామని, రైతులు అధైర్యపడొద్దని పంట నష్టం సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి నివేదిక అందజేసి నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకోమని కోరతామన్నారు.
తదుపరి వేములవాడలో కాలువకి గుర్రపు డెక్క కిలోమీటరు మేర అడ్డుగా ఉందని పిల్లి దంపతుల దృష్టికి తీసుకు రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో గండి వెంకటేశ్వరరావు, ఆట్ల గోవిందు, గొల్లపల్లి బుజ్జి, చీపురుపల్లి జయేంద్రబాబు, కాకర్ల బుజ్జి, కాళ్ల శ్రీను, మద్దూరి స్వామి, పేపకాయల సత్తిబాబు, గుత్తుల శ్రీను, బొంతు వీరబాబు, రాంబాబు,సురేష్, పెంకె సోమరాజు, వాసంశెట్టి బుజ్జి, నాగం బాబులు, శ్రీపాదం సత్తిబాబు, జక్కి అప్పన్న, బొజ్జ భవాని సాంబశివరావు, శర్మ తదితరులు పాల్గొన్నారు.