- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు నీట మునిగి ఏడుపాయల్లో యువకుడు మృతి
దిశ, కొల్చారం: ప్రమాదవశాత్తు మంజీరా నదిలో నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొల్చారం మండలం లో వెలుగు చూసింది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మృతుని తల్లి యాదమ్మ కథనం ప్రకారం వివరాలు... మండల కేంద్రమైన రేగోడు గ్రామానికి చెందిన గుడిసెల యాదమ్మ ఆమె కుమారుడు గుడిసెల లక్ష్మణ్ (24) గత రెండు సంవత్సరాలుగా మెదక్ పట్టణంలో కూలి పని చేస్తూ అద్దెకు ఉంటున్నారు. గురువారం లక్ష్మణ్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మల్లేశం, మెదక్ పట్టణానికి చెందిన బత్తిని లలిత, వడ్డే లక్ష్మీలతో కలిసి పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుండి ఏడుపాయల వెళ్లే దారిలో మంజీరా నదిలో వినాయక విగ్రహాలు, దుర్గ భవాని విగ్రహాల కు చెందిన ఇనుప సలాక ముక్కలు నీటి నుండి వెలికి తీస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు.
లక్ష్మణ్ నీటిలో నుంచి సలాకులు తీస్తుండగా మిగిలిన ముగ్గురు విడిచే పైనుండి తాడుతో పైకి తీసుకుంటున్న క్రమంలో లక్ష్మణ్ నీట మునిగిపోయాడు. ఈ విషయాన్ని లలిత లక్ష్మణ్ తల్లికి ఫోన్లో తెలుపగా వెంటనే తల్లి యాదమ్మ లక్ష్మణ్ బంధువులు వచ్చి. నీటిలో గాలించినప్పటికీ లక్ష్మణ్ మృతదేహం లభించలేదు .శుక్రవారం సాయంత్రం బ్రిడ్జ్ కింద నీటిలో లక్ష్మణ్ మృతదేహం ఆచూకీ లభించింది. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్, పోలీసు సిబ్బంది వెలికి తీయించారు తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.