- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: వైసీపీలో చేరడంపై కాపు నేత ముద్రగడ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ దక్కని ఆశావహులు, పార్టీ అధిష్టానంపై అసంతృప్తి ఉన్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు జనసేన పార్టీలో చేరుతారని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యూ టర్న్ తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుతో నొచ్చుకున్న కాపు నేత ముద్రగడ అధికార వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై ముద్రగడ పద్మనాభం ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ ఇవాళ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరే రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు.
ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లి వెళ్తున్నానని తెలిపారు. కిర్లంపూడి నుండి తాడేపల్లి వరకు అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలని సూచించారు. సీఎం జగన్ పిలుపు మేరకే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్‌ను మరోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడ ఉన్న పేదల సంక్షేమానికి పాటుపడతానన్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు.. చేయను కూడా అని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎన్నికల ముంగిట బలమైన కాపు నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.