- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది మగతనం అనిపించుకోదు.. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ 22 సీట్లు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ తీసుకున్న ఈ సీట్లపై కాపు ఉద్యమ నేత, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సెటైర్లు వేశారు. తీసుకున్న ఆ సీట్లను కూడా త్యాగం చేసి జనసేన ప్యాకప్ చేస్తే తాగశీలిగా పవన్‌కు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ సీఎం అయిన తర్వాత కాపు ఉద్యమాన్ని ఎందుకు ఆపేశారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. నారా లోకేశ్‌తో పాదయాత్ర చేయింది పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయడానికి కాదన్నారు. చాటుమాటున ఉండి తనపై విమర్శలు చేయడం మగతనం అనిపించుకోదన్నారు. క్లబ్బులు నడిపే వ్యక్తులతో తనను తిట్టిస్తున్నారని, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.