- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఈసీని కలిసిన కేఏ పాల్.. కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు
దిశ వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ బృందాన్ని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని.. అలానే పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని సీఈసీ కోరినట్లు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుందని.. కనుక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చందద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ద్రుష్టి సారించిన పాల్ కాపులందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు. అలానే వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దని.. ఇది పవన్ కల్యాణ్‌కి నా పర్సనల్ రిక్వెస్ట్ అని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్యం బాగానే ఉందని.. తన మీద శత్రువులు విష ప్రయోగం చేసిన.. దేవుని కృప.. వైద్యుల సహాయం తనని రక్షించాయి పేర్కొన్నారు. అలానే తన మీద విష ప్రయోగం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.