- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడ్జిమెంట్ డే : చంద్రబాబుకు రేపే అత్యంత కీలకం
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే ఈ దేశంలో తెలియనివారుండరు. ఒకప్పుడు ఎన్డీఏ చైర్మన్ సైతం వ్యవహరించి దేశ రాజకీయాలను శాసించారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి ఎంపిక ప్రక్రియలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారంటే ఆయన రాజకీయ పరిణత ఎంతటిదో మనకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. 45ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు రాష్ట్రాల పాలనలో తన ముద్ర వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఏనాడూ జైలు కాదు కదా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదు. అదంతగా గతం ఇప్పుడు సీన్ మారిపోయింది. పాలన మారింది. చంద్రబాబు నాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈనెల 19 వరకు చంద్రబాబు జైలులోనే ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. స్కిల్ స్కాం కేసు రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానాల్లో సైతం ఊరట లభించడం లేదు. అటు విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో బెయిల్ లభించడం లేదు. జైలులో చంద్రబాబు ప్రాణానికి హాని ఉందని టీడీపీ ఆందోళన చేస్తున్న.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కానీ కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం రోజు రోజుకు దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది.
సుప్రీం తీర్పు రేపే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రేపు అత్యంత కీలకంగా కానుంది. చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న వరుస కేసులకు సంబంధించి తీర్పులు వెల్లడయ్యే రోజు కావడంతో సోమవారం తీర్పులపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఈ మూడు కోర్టులు సోమవారం తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఆధారాలను సుప్రీంకోర్టుకు అందజేయాలని సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 9కు వాయిదా వేసింది. రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తిరిగి వాదనలు జరగనున్నాయి. అయితే సోమవారం వాదనలు పూర్తై తీర్పు వెల్లడవుతుందా? లేకపోతే వాదనలు విని మరో రోజుకు తీర్పును వాయిదా వేస్తోందా? సందేహం నెలకొంది. దాదాపు రేపే తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బెయిల్ వస్తోందా? లేక సుప్రీంకోర్టులోనూ చుక్కెదురవుతుందా అంటూ ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు ఊరట లభిస్తే దిగువ కోర్టులో ఊరట లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏసీబీ కోర్టులోనూ...
స్కిల్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి ఈనెల 9న తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విచారణను వాయిదా వేశారు.
హైకోర్టులో మూడు పిటిషన్లపై తీర్పు
ఇదిలా ఉంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సైతం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మూడు బెయిల్ పిటిషన్లపైనా సోమవారం తీర్పు వెల్లడికానున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి విచారించారు. ఇటీవలే వాదనలు సైతం ముగిశాయి. దీంతో ఈ మూడు పిటిషన్లపై తీర్పును సోమవారం వెల్లడించనున్నారు. దీంతో ఈ మూడు తీర్పుల్లో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీలోనే లోకేశ్
ఢిల్లీ పర్యటన నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 5న రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తండ్రి చంద్రబాబునాయుడును కటుంబ సభ్యులతో కలిసి ములాఖత్‌లో భాగంగా కలిశారు. అనంతరం శనివారం రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. స్కిల్ స్కాంకు సంబంధించి పలు ఆధారాలను సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తన తండ్రి బెయిల్‌పై విడుదలయ్యేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ మంజూరైన అనంతరం లోకేశ్ ఢిల్లీ నుంచి వస్తారని అప్పటి వరకు అక్కడే ఉండి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది.