టీడీపీ అభ్యర్థిగా జర్నలిస్టు మురళి ?

by samatah |
టీడీపీ అభ్యర్థిగా జర్నలిస్టు మురళి ?
X

దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానిక జర్నలిస్ట్ మురళీ మోహన్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పూతలపట్టు ఒకటి. ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఇది. 2009లో నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదిక్కడ. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పీ రవి విజయం సాధించారు. ఎల్ లలిత కుమారిని ఓడించారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎం సునీల్ కుమార్ 902 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2019లో ఎంఎస్ బాబు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ మూడు ఎన్నికల్లోనూ పూతలపట్టు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎల్ లలితకుమారి పోటీ చేశారు. ఈ సారి ఆమెకు మళ్లీ టికెట్ ఇవ్వదలచుకోలేదు చంద్రబాబు. లలిత కుమారికి బదులుగా జర్నలిస్టు మురళీ మోహన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఇక్కడ పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed