రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లల మిస్సింగ్.. పవన్ ఆగ్రహం

by srinivas |
రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లల మిస్సింగ్.. పవన్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎర్రచందనాన్ని ఇంధనం మార్చుకున్నారని మండిపడ్డారు. చాలా మందని హత్యలు చేసి తమ నేతలు, కార్యకర్తలను బెదిరిస్తారా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులనే కాదని.. సాధారణ ప్రజలనూ వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎవరికీ భయపడొద్దని సీమ వాసులను పవన్ కోరారు. జగన్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి ఎన్నాళ్లు భయపడతారని పవన్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఫీజు రియింబర్స్ మెంట్ చేస్తామన్నారు. సీపీఎస్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం కావాలన్నారు. పోలీసులు ఒకటవ తారీకునే జీతాలు చెల్లించాలని, వారంతాపు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed