- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎన్నికల వేళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జనసేన ఎన్నికల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని పవన్ ఆదివారం ప్రకటించారు. ఈ కమిటీ.. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తోన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కూటమి నేతల మధ్య సమన్వయం, ప్రచార వ్యవహారాలు, పోల్ బూత్ మేనేజ్మెంట్ తదితర అంశాలను పర్యవేక్షించనుంది. ఈ మేరకు పిఠాపురంలో కమిటీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాగా, జగన్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే.
మూడు పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల పంపకం సైతం పూర్తైంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. జనసేన పోటీ చేయనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పవన్ అభ్యర్థులను ఎంపికను పూర్తి చేశారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల మధ్య సమన్వయం కోసం తాజాగా జనసేన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు.