- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ చేసిన పాపాలు.. రాయలసీమకు శాపాలు: నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన పాపాలు రాయలసీమకు శాపాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన నేరాలు ఏపీ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేకహోదా వదులుకున్నాడని... విశాఖలో రుషికొండకు గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్‌కి నీళ్లొదిలాడని లోకేశ్ ఆరోపించారు. బాబాయ్‌ని చంపించిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశాడని ధ్వజమెత్తారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం దారుణ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులు పునఃసమీక్ష జరుగుతోందని ఆరోపించారు. ప్రజలారా...జగన్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి అని సూచించారు. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణాజలాలలో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే... రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. బాబాయ్‌ని చంపించిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారు అని నారా లోకేశ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే నారా లోకేశ్ ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు. శుక్రవారం ములాఖత్‌లో భాగంగా నారా లోకేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.