- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నామినేషన్ వేళ పులివెందులలో షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ నేడు పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వైఎస్ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అన్నారు. వైఎస్ ఆర్ చనిపోయాక ఆయన కుంటుంబం మీద కుట్రలు చేసింది ఎవరూ అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరు? అని ప్రశ్నించారు. మన శత్రువులతో కలిసి.. వారి పార్టీలో చేరిపోయిన వాళ్లా వైఎస్ ఆర్ వారసులు షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుట్రలో భాగమవుతున్న వీళ్లా వైఎస్ఆర్ వారసులు అని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది ఎవరు? అని క్వశ్చన్ చేశారు.