- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ గ్రీన్ మ్యాట్ సభ.. ఆ ఒక్క మీడియాకే అనుమతి..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షానికి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. అటు బహిరంగ సభల్లోనూ ఇటు సోషల్ మీడియా లోనూ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్(x) వేదికగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి "గ్రీన్ మ్యాట్" సభకు, సాక్షి తప్ప, ఇతర మీడియాకి అనుమతి లేదని తెలిపారు.
గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ బయట పడతాయనే ఉద్దేశంతోనే జగన్ రెడ్డి మీడియా సిబ్బందికి పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. ఇక అలానే ఎస్పీ కార్యాలయం నుంచి 149 నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని.. ఇది తాడేపల్లి పిల్లి బాగోతమని ఎద్దేవ చేశారు.
కాగా లోకేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది మా కార్యకర్తల సభ.. మీకెందుకురా మా సభతో పని. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. జగన్ అన్న ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్తున్నారు అని ఒకరు కామెంట్ చెయ్యగా.. ఇంతోటిదానికి సింహం సింగిల్ సిద్ధం అనే డైలాగులు దేనికిరా.. ఫిలిం సిటీలో సెట్ వేసుకుని నాలుగు గ్రీన్ మ్యాట్ లు కట్టుకుని కోటి మంది వచ్చారని వేసుకో సభ అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా వైసీపీ, టీడీపీ అభిమానులకు మధ్య కామెంట్ల వర్షం కురుస్తోంది.