- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో వారికి తీపికబురు.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు జమ చేసిన జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా మరో అడుగు ముందుకు వేశారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో జీవనోపాధి కోల్పోయిన 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఓఎన్జీసీ పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000 చొప్పున సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు సైతం పాల్గొన్నారు.
వాయిదా పడటంతో..
ఇకపోతే వాస్తవానికి సీఎం వైఎస్ జగన్ తిరుపతి జిల్లా మాంబట్టు వద్ద మత్స్యకారులకు మేలు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గనాల్సి ఉంది. తిరుపతి జిల్లా వాకుడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు, పులికాట్ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణ పనుల సహా మరికొన్ని పనులను సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీ పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం డబ్బు విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని, ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోనే నిర్వహించారు. ఓఎన్జీసీ పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల నిధులను సీఎం బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
Read More..