- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
జగన్ సర్కార్ కీలక నిర్ణయం: స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇన్చార్జిపై వేటు
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇన్చార్జి ఆర్.హరిప్రకాశ్పై వేటు వేసింది. స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇన్చార్జి పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆర్ధిక శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరిప్రకాశ్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం అదేశాఖలో జాయింట్ డైరెక్టర్ విజయభారతికి స్టేట్ ఆడిట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపోతే గత కొంతకాలంగా వేధింపులు, అక్రమ బదిలీలపై ఆర్.హరిప్రకాశ్పై గత కొంతకాలంగా ఆడిట్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్.హరిప్రకాశ్ను స్టేట్ ఆడిట్ డైరెక్టర్గా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story