- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలికపూడి శ్రీనివాసరావు పట్ల జగన్ రెడ్డి వేధింపులు దుర్మార్గం: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ పేరుతో జగన్ రెడ్డి వేధించడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేతపై వేధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి దమనకాండకు నిదర్శనం అని అన్నారు. నోటీసులిచ్చేందుకు హైదరాబాద్‌లోని కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సీఐడీ.. ఆయన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు అని మండిపడ్డారు. 11 ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరించడం అమానవీయం అని అన్నారు. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదు. కొలికపూడి నివాసానికి విజిటర్స్‌గా వచ్చిన సీఐడీ నానా భీభత్సం సృష్టించారు అని మండిపడ్డారు. కొలికపూడి చేసిన తప్పేంటి? ప్రజాసమస్యలు, జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ప్రశ్నించేవారిని చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. మరో వందరోజుల్లో జగన్ రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.