Jagan, Pawan: జగన్, పవన్ ఈరోజు ఓటు వేయరట.. ఎందుకంటే..

by Anil Sikha |   ( Updated:2025-02-27 06:04:59.0  )
Jagan, Pawan: జగన్, పవన్ ఈరోజు ఓటు వేయరట.. ఎందుకంటే..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీలో రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate mlc election) ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. గ్రాడ్యుయేట్స్​ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్​మోహన్​రెడ్డి (YS jagan), జనసేన అధినేత పవన్​కల్యాణ్ (Pawan kalyan)​ఓటు వేస్తారా లేదా.. అనే ప్రశ్నలు ప్రజల్లో కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు (chandrababu), ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ (lokesh)​ఉండవల్లిలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే జగన్, పవన్​ మాత్రం తమ ఓటు వేయలేదు..ఎందుకంటే.. ఏపీలో రెండు చోట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటి గుంటూరు,కృష్ణా జిల్లా నియోజకవర్గం కాగా మరొకటి ఉభయగోదావరి ఉమ్మడి జిల్లా నియోజకవర్గం. వైఎస్​జగన్​ సొంత నియోజకవర్గం పులివెందుల. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలులేవు. దీంతో ఆయన ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. ఇకపోతే పవన్​కల్యాణ్​గ్రాడ్యుయేట్​కాదు. కాబట్టి ఆయనకు గ్రాడ్యుయేట్​ఓటు లేదు. వీరిద్దరూ తాము సూచించిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నారు.. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి ఓటేయండి అంటూ పవన్​కల్యాణ్​ఓ వీడియోను విడుదల చేశారు. అదే విధంగా పీడీఎఫ్​అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్​ తమ మద్దతు తెలిపారు. కానీ తమకు ఓటు లేకపోవడంతో ఈ అభ్యర్థులకు వారు మాత్రం వేయడం లేదు.

Next Story

Most Viewed