- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు ఏమైనా జరిగితే జగన్‌దే బాధ్యత : యనమల
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్కిన్ అలర్జీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వఆస్పత్రి వైద్యులు చంద్రబాబుకు జైలులో చికిత్స అందిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలులో 5 కిలోల బరువు తగ్గారని మరో రెండు కిలోల బరువు తగ్గితే కిడ్నీలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లోని అపరిశుభ్ర వాతావరణం వల్ల చంద్రబాబు నాయుడు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. చంద్రబాబుకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని కోరారు. సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుకు ఏమైనా జరిగితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.