రూ.3వేల కోట్లు అప్పు చేసిన జగన్ సర్కార్

by Seetharam |   ( Updated:2023-07-04 10:42:09.0  )
రూ.3వేల కోట్లు అప్పు చేసిన జగన్ సర్కార్
X

దిశ,డైనమిక్ బ్యూరో : ఆంధప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మరోసారి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది. రూ.3 వేల కోట్ల అప్పును జగన్ సర్కార్ రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 3 వేల కోట్లు అప్పు చేసింది. వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 16 సంవత్సరాలకు 7.52 శాతం వడ్డీతో, ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో లోన్ తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ మూడు వేల కోట్ల రుణంతో ఏపీ ప్రభుత్వం రూ. 25,500 కోట్లు అప్పు తెచ్చినట్లైంది. అంటే 90 రోజుల్లో రూ. 25 వేల కోట్లు అప్పు చేసింది. అయితే ఈఏడాది ఎఫ్‌ఆర్‌బిఎంలో ఇంక మిగిలింది కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే.ఇకపోతే ప్రస్తుతం తీసుకున్న రూ.3వేల కోట్లతోనే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story