- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై చంద్రబాబు విధానమేంటో చెప్పాలి:కాంగ్రెస్ సీనియర్ నేత
దిశ ప్రతినిధి,తిరుపతి:రాష్ట్రంలో ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు అనే రాజకీయ సినిమా రసవత్తరంగా సాగుతోంది. ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ డా.ఎన్.తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల ముద్దుల మొగుడు నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని అన్నారు. పదేళ్లలో విభజన హామీలు అమలు చేసింటే ఏపీ స్వర్ణాంధ్ర అయ్యేదని చెప్పారు.
ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందని పార్లమెంట్లో ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలు కాలేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలో కీలకంగా ఉన్నారని ఇప్పుడైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తేల్చిచెప్పారు. విభజన వరాలను నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేయాలన్నారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అమలుకు చంద్రబాబుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.