- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IT Raids: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం (YCP Government)లో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ అధికారులు (Income Tax Officials) ఫొకస్ పట్టారు. పదవిలో ఉన్నంత కాలం సంపాదించిన ఆస్తులపై ఆరా తీస్తూ.. వాళ్ల ఇళ్లలో వరుసగా సోదాలు చేపడుతున్నారు. తాజాగా, భీమవరం (Bheemavaram) వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) ఇంటిపై ఇవాళ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధ్వర్యంలో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయా కార్యాలయాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే, ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. దీంతో అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల వైఎస్ జగన్ (YS Jagan) జిల్లా నయోజకవర్గ ఇంచార్జీలతో సమావేశం నిర్వహించగా.. ఆ మీటింగ్‌కు కూడా మాజీ ఎమ్మెల్యే అటెండ్ కాలేదు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. అదేవిధంగా ఆయన టీడీపీ (TDP)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.