AP News:రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం..తేల్చి చెప్పిన జనసేనాని!

by Jakkula Mamatha |   ( Updated:2024-04-23 14:44:34.0  )
AP News:రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం..తేల్చి చెప్పిన జనసేనాని!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పవన్‌తో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ఘనవిజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు సీట్లు త్యాగాలు చేశారని తెలిపారు. 30, 40 చోట్ల మా అభ్యర్థులకు సర్ధి చెప్పిన అన్నారు. వర్మ జనసేనకు మద్దతిచ్చి పిఠాపురంలో సీటు త్యాగం చేశారు. ఆయనకు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో కూర్చోబెడతాం అని పవన్ చెప్పారు.

Read More...

జనసైనికులకు BIG సర్‌ప్రైజ్.. పవన్ తరపున ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి?

Advertisement

Next Story