- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి జగన్‌దే : కే రామకృష్ణ
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి సీఎం వైఎస్ జగన్‌కే చెందుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసైనా జగన్ సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలి అని సూచించారు. తెలంగాణలో నూతన సచివాలయాన్ని అధునాతన భవనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నారు అని గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది అని విమర్శించారు. మాట్లాడితే మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చింది సీఎం జగన్ నిలదీశారు. తెలంగాణలో నిర్మాణాలు జరుగుతుంటే, ఏపీలో కూల్చివేతల పాలన సాగడం దురదృష్టకరమన్నారు. ఏపీలో అమరావతిలో భూములు, ఇతర వనరులున్నా రాజధాని నిర్మించలేకపోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు.