నా కొడుకును అరెస్ట్ చేయడం న్యాయమేనా: మాజీ మంత్రి జోగి రమేష్

by Mahesh |   ( Updated:2024-08-13 11:55:22.0  )
నా కొడుకును అరెస్ట్ చేయడం న్యాయమేనా: మాజీ మంత్రి జోగి రమేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం తెల్లవారు జామున సీఐడీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను విక్రయించారని తేలడంతో మాజీ మంత్రి జోగి రమోశ్ కుమారుడు రాజీవ్ ను, అలాగే మరికొందరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడు రాజీవ్ ను అరెస్ట్ చేయడం పై జోగి రమేష్ స్పందించారు. తనపై టీడీపీ పార్టీకి కక్ష ఉంటే అది తనపైనే తీర్చుకోవాలని, అమెరికాలో చదివి వచ్చిన తన జాబ్ తాను చేసుకుంటున్న తన కుమారుడిని అరెస్ట్ చేయడం న్యాయమా.. అంటూ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారని ఇలాంటి కక్షసాదింపు దుర్మార్గాలకు సీఎం చంద్రబాబు గారు ఒడిగట్టవద్దని మీడియాతో చెప్పుకొచ్చారు.

Read More..

BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బిగ్ షాక్.. కుమారుడు రాజీవ్ అరెస్ట్!

Advertisement

Next Story