Breaking:ఎన్నికల వేళ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ..

by Indraja |   ( Updated:2024-02-15 09:26:08.0  )
Breaking:ఎన్నికల వేళ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ..
X

దిశ డైనమిక్ బ్యూరో: రాజులు లేరు, రాజ్యాలు లేవు. కానీ తారలు మారిన యుగాలు గడిచిన వంశపార పరిపాలన మాత్రం పోవడం లేదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులన్న మాట పుస్తకాలకే పరిమితమైంది అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాజరిక పాలనా పోయి కుటుంబ పాలనా వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం యువత లో వస్తున్న మార్పును చూస్తే అతి త్వరలోనే పరాజలే పాలకులను మాట నిజమవుతుందేమో అని అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇటీవల జరిగిన తెలంగా అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అనే యువతీ ఇండిపెండెంట్ గా పోటీ చేసింన విషయం అందరికి తెలిస్తే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. పేద వర్గాల ఐఖ్యత..అధిక జనులకు అధికారమే లక్ష్యం అంటూ ఓ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో అయన మాట్లాడుతూ పీడితులుగా ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలను అధికారం వైపు నడిపించడమే తమ లక్యమని పేర్కొన్నారు.

ఇక బానిసత్వం నుండి విముక్తి వైపు నడిపించే పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అన్నారు. కాగా ఈ పార్టీ జెండాలో ఒక చక్రం, ఆ చక్రంలో ఎనిమిది ఊసలు ఉంటాయి. అలానే తామ పార్టీ నీలి రంగు జెండా పవిత్రత, స్థిరత్వం, స్ఫూర్తి, విజ్ఞతకు,విశాలతత్వానికి, స్వాభిమానానికి, సగౌరవానికి ప్రతీక అని తెలియజేశారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని.. దోపిడీ, ఆధిపత్య, అణిచివేత పైనే తమ పోరాటమని వెల్లడించారు. ఇక తాను ఓ పదవి కోసం లేదా ఓ అవకాశం కోసం రాజకీయాల్లోకి రాలేదని చెబుతున్నారు. నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితితో అధిక జనుల కోసం పని చేస్తానని తెలిపారు.

Advertisement

Next Story