‘తనతో సినిమా చేస్తా అని అడిగా.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?’.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-14 17:42:53.0  )
‘తనతో సినిమా చేస్తా అని అడిగా.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?’.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పిఠాపురం సాక్షిగా నిజమే చెబుతున్న.. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటా అని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేడు(శుక్రవారం) కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. ఈ సభలో మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌‌తో సినిమాలు తీయాలనేది ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పవన్ తో మూవీ తీయాలనేది నా కోరిక అని.. ఇదే విషయం పై పవన్ కళ్యాణ్‌కు చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ స్పందించి.. సినిమా చేస్తానని మాటిచ్చారని అన్నారు.

పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడని తెలిపారు. పార్టీలో ఉన్న లేకున్నా పవన్ కళ్యాణ్‌తోనే ఉంటా అని బాలినేని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ పై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా అన్నారు. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశాను అంటూ ఆవేదన చెందారు. మాజీ సీఎం జగన్ వల్ల నేను నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం అని తెలిపారు. వైఎస్ జగన్ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. ఈ క్రమంలో చేసిన పాపాలు ఎక్కడికి పోవని.. జగన్ తెలుసుకోవాలని సూచించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ.. స్కాములు చేసి రూ. కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్ట్ చేయడం లేదు అదే నా బాధ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

READ MORE ...

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ ఈయన నాకు ప్రొఫెసరే: పవన్ కల్యాణ్







Next Story