- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఆసరాగా అందించే పెన్షన్ డబ్బులు కూడా వైసీపీ మింగేంసిందని.. నేడు వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేని దుస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకే ఈసీ, నిమ్మగడ్డ పై వైసీపీ నేతలు, అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి పంపిణి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కొల్లేరు సమస్యపై కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే.. పరిధిలోని 5వ కాంటూరు నుండి 3వ కాంటూరుకు కుదించాలి అని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు సమస్యను పరిష్కారిస్తాను అని ధీమా వ్యక్తం చేశారు.