- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Inhuman Incident: రాష్ట్రంలో అమానవీయ ఘటన.. పర్యావరణ ప్రేమికుడిపై ఆక్వా రైతుల దాష్టీకం
దిశ, వెబ్‌డెస్క్: ప్రశ్నించడమే అతడు చేసిన తప్పేమో.. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యంపై ఓ యువకుడు చేసిన పోరాటం అతడికి శాపంగా మారిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పలగుప్తం (Uppalguptham) మండల పరిధిలోని సన్నవిల్లి (Sannavilli) ఆక్వా పరిశ్రమ (Aqua Industry)కు పెట్టింది పేరు. ఈ క్రమంలోనే గ్రామంలో గత కొంతకాలం నుంచి కొందరు అక్రమంగా చెరువులు తొవ్వుతూ ఇష్టానుసారంగా ప్రకృతి వనరుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
అయితే, గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ (Chikkam Veera Durga Prasad) అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై గళం విప్పాడు. ఇటీవలే గ్రామంలో చెరువుల తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటు తాగే నీరు కూడా కలుషితం అవుతోందని న్యాయ పోరాటానికి దిగాడు. అయితే, అతడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వుల జారీ చేసింది. కాగా, గ్రామంలో తాజాగా చేపడుతున్న చెరువుల తవ్వకాలపై అధికారులు ఫొటోలు పంపాలని కోరగా.. చెరువుల వద్దకు వెళ్లిన వీర దుర్గాప్రసాద్‌ను ఆక్వా రైతులు స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన పర్యావరణ ప్రేమికులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.