- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు జిల్లా జనసేన.. పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి
దిశ, నెల్లూరు : నెల్లూరు నగరంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసైనికులు జోరు పెంచారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గునుగుల కిశోర్ తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు. అధిష్టానం నెల్లూరులో పార్టీ బలోపేతానికి అంత దృష్టి సారించనప్పటికీ కిశోర్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతూ పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కిశోర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేణులు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారని సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి నియోజకవర్గ నేతలను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. గునుగుల కిశోర్ జిల్లా అధ్యక్షుడైతే బాగుంటుందని జనసైనికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
పార్టీకి మైనస్‌గా మారిన వర్గవిభేదాలు
ఇటీవల కాలంలో వారి మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. టిక్కెట్ నాదంటే నాదంటూ ప్రచారాలు చేసుకోవడం మొదలు పెట్టారు. నెల్లూరు సిటీలో ఇద్దరి నేతల మధ్య కొంత కాలం పోస్టర్ల వార్ నడిచింది. గోడలకు అతికించిన తమ నేతల పోస్టర్లు చించారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని వివాదాస్పదమయ్యారు. ఒకే పార్టీలో ఉంటూ పరస్పర సహకారం చేసుకోవాల్సింది పోయి ఇదేం పంచాయితీ అంటూ ఓటర్లు సైతం విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి తీరుతో నేతలు విసిగిపోతున్నారు. ఆయన నుంచి విడిపోయి వారు వేరు కుంపటి పెట్టి పార్టీలోనే కొనసాగుతూ ఎవరికి వారే కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెల్లూరు సిటీ టికెట్ తమకే కేటాయిస్తుంది చెప్పుకుంటూ ప్రజా బాట పట్టి ఓట్లడుగుతున్నారు. తామే జనసేన పార్టీ అభ్యర్థినని చెప్పుకుంటూ సిటీలోనే ఇద్దరు నేతలు వేరువేరుగా వెళ్లీ ఓట్లడగడంతో ఓటర్లు కూడా అయోమయంలో ఉన్నారు.
కిశోర్‌కు నాగబాబు అండదండలు
జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డితో విడిపోయి వేరు కుంపటి పెట్టిన వారిలో గునుగుల కిషోర్ ఒకరు. మనుక్రాంత్‌కు దారంగా పార్టీలోనే కొనసాగుతూ ఎవరికి వారే కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు అండ్ కిషోర్‌కు లభించడంతో జిల్లా జనసేన పార్టీ బలోపేతంపై పూర్తిగా దృష్టి సారించారు. పార్టీ సభ్యత్వ నమోదు, చేరికలు కిషోర్ హయాంలోనే ఎక్కువగా జరిగాయి. దీంతో అధిష్టానం సపోర్టుతో, నాగబాబు కిషోర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు సుముఖత చూపుతున్నారని తెలుస్తోంది.