స్టూడెంట్స్‌కు ముఖ్యగమనిక: బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

by Seetharam |
స్టూడెంట్స్‌కు ముఖ్యగమనిక: బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఏపీఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్ధులకు వెర్వేరుగా షెడ్యూలు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎంపీసీ విద్యార్ధులు నవంబరు ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు ఆన్ లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని వెల్లడించారు. ఆన్ లైన్‌తో పాటు సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్‌కు నవంబరు 8, 9 తేదీలు కేటాయించినట్లు తెలిపారు. నవంబరు 10, 11,12 తేదీలలో మూడు రోజుల పాటు అవకాశం కల్పించామని నాగరాణి వివరించారు. 12 తేదీ ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందని...14వ తేదీ సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నవంబరు 15, 16 తేదీలలో సీట్లు పొందిన అభ్యర్ధులు అయా కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయవలసి ఉంటుదని స్పష్టం చేశారు. ఇకపోతే బైసీపీ విద్యార్ధులు కూడా నవంబరు 1 నుండి 8వతేదీ వరకు ఆన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. తదుపరి ప్రకియలో మార్పులు ఉన్నాయని కన్వీనర్ వెల్లడించారు. ఆన్ లైన్, సహాయ కేంద్రాల వద్ద ధృవీకరణ పత్రాల నిర్ధారణకు నవంబరు 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. నవంబరు 11 నుండి 13 వరకు ఐచ్చికాలను నమోదు చేసుకునేందుకు గడువు ఇచ్చామన్నారు. ఐచ్చికాల మార్పుకు నవంబరు 14వ తేదీ అవకాశం కల్పించగా...17వ తేదీ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నామని చదలవాడ పేర్కొన్నారు. నవంబరు 18 నుండి 21 వరకు బైపిసి విద్యార్ధులు కళాశాలల్లో స్వయంగా రిపోర్డు చేయాలన్నారు. షెడ్యూలు పరంగా బైపీసీ, ఎంపీసీ విద్యార్ధులకు ఉన్న తేడాలను గుర్తించి వ్యవహరించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఏపీఈఏపీ సెట్ ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed