తన గారాల పట్టి కోరితే కాదంటారా.. ఆద్యకు పవన్ కళ్యాణ్ ఏం కొనిచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Kavitha |
తన గారాల పట్టి కోరితే కాదంటారా.. ఆద్యకు పవన్ కళ్యాణ్ ఏం కొనిచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా, డిప్యూటీ సీఎం గారి తాలుకా అంటూ ఫ్యాన్సే కాదు సామాన్య ప్రజలు కూడా గర్వంగా చెప్పుకునే పవన్ తీరు ఉంది. అయితే ప్రజలు ఏమైనా కోరికలు అడిగితేనే తీర్చకుండా ఉండని పవన్ కళ్యాణ్.. తన గారాల పట్టి ఆద్య అడిగితే చేయకుండా ఉంటారా..? ఛాన్సే లేదు. మరి ఇంతకీ తన కూతురు ఏం అడిగింది..? పవన్ కళ్యాణ్ ఏం కొనిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు గానీ, దేశ రాజధానికి గానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఆయన ఆలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు… ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు. అతిథులు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకుని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధ పరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. ఇక లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను పవన్ తన కుమార్తె ఆద్యతో కలిసి తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడగా పవన్ కళ్యాణ్ వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు. దీంతో ఈ వార్త కాస్త వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed