కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లడ్డూ తయారీలో నందిని నెయ్యిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు

by Mahesh |
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లడ్డూ తయారీలో నందిని నెయ్యిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు తో తయారు చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డు పవిత్రతను దెబ్బతీశారని ఇష్యూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. లడ్డూ ప్రసాదం వివాదంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో లడ్డూల తయారీలో నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కర్ణాటక ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అన్ని ఆలయాల్లోని లడ్డూ తయారీలో కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.

Next Story

Most Viewed