Rajinikanth: ‘వెట్టైయాన్’ టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూపర్ స్టార్ లుక్స్

by Hamsa |
Rajinikanth: ‘వెట్టైయాన్’ టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూపర్ స్టార్ లుక్స్
X

దిశ, సినిమా: ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టైయాన్’. టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘వేటగాడు’ పేరుతో విడుదల కాబోతుంది. అయితే ప్రజెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కనుకగా అక్టోబర్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే వెట్టైయాన్ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేశాయి.

అలాగే ఇందులోంచి ఇటీవల రిలీజ్ అయిన ఓ సాంగ్ అందరినీ మైమరిపించింది. తాజాగా, వెట్టైయాన్ నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి దానికి సెకండ్ సింగిల్ హంటర్‌ను యాడ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనింపించిన సూపర్ స్టార్ లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.



Next Story

Most Viewed