ఘోరం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

by Kavitha |
ఘోరం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, మాడుగులపల్లి: మాడుగుల పల్లి(Madugula Pally) మండల కేంద్రంలో డీసీఎం(DCM) ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుగుల(Indhugula) ఆవాస గ్రామం మలప రాజు గూడెం(Malapa Raju Gudem)కు చెందిన పుట్ట శేఖర్(30) ఉదయం 7 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలోని దాబా దగ్గర వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Next Story