తెలంగాణ బంద్‌కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు.. జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

by Mahesh |
తెలంగాణ బంద్‌కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు.. జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ అత్యాచారానికి ప్రయత్నించి.. తీవ్రంగా దాడి చేసి.. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి తోసేశాడు. అనంతరం రన్నింగ్ ఆటో నుంచి పడిపోయిందని, చెప్పే ప్రయత్నం చేశారని.. జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివాసులు, నిందితుడి వర్గానికి చెందిన వారి మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో జైనూర్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్ కట్ చేసి.. 144 సెక్షన్ అమలు చేసి.. అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. జైనూర్‌ ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చిన బస్సులను తుడుందెబ్బ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed