- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైతులను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ నాయకుల చర్యలు! మీడియా సమావేశంలో కాంగ్రెస్
దిశ, తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయాలని తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గ సభ్యులను రైతులు శుక్రవారం దిగ్బంధించి భవనానికి తాళం వేశారు.ఇది పక్కా బీఆర్ఎస్ నాయకుల పనేనని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నారనే అక్కసుతోనే రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... సొసైటీ డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసుకున్న క్రమంలో పథకం ప్రకారం బీఆర్ఎస్ నాయకులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు రైతులకు ఎంత మేరకు రుణమాఫీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రశ్నించారు.రైతులను దగా చేసిన ప్రభుత్వం బీఆర్ఏస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారికి సొంతింటి కళగా ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మండలంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించారో చూపెట్టాలని సవాల్ విసిరారు. మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ పూర్తి చేస్తామని అక్కడక్కడ సాంకేతిక కారణాలు ఆధార్ బ్యాంక్ ఖాతాలో లబ్ధిదారుల పేర్లు రెండింటిలో ఒకేలా లేకపోవడంతోనే వారికి రుణమాఫీ కాలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, యువత అధ్యక్షుడు అఖిల్ రావు, అంబీర్ శ్యామ్ రావు, బండారు సంజీవులు, రాజు, మాజీ ఎంపిటిసి జలంధర్ రెడ్డి, తిప్పారావ్ మోహన్ రెడ్డి, సుధాకర్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.