Big Breaking: గోదావరి పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్.. భయాందోళనల్లో ప్రజలు

by karthikeya |   ( Updated:2024-09-21 04:47:00.0  )
Big Breaking: గోదావరి పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్.. భయాందోళనల్లో ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిలో గ్యాస్ లీక్ అవుతున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి గోదావరిలో గ్యాస్ పైపులైను లీక్ అవుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా ఓఎన్‌జీసీ చమురు సంస్థ గోదావరిలో వేసిన పైపులైను నుండి ఈ గ్యాస్ లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ లీకేజీతో గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి వస్తోంది.

దీంతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు, మత్స్యకారులు.. కిలోమీటర్ల దూరం వరకు గ్యాస్ వాసన వస్తోందని, మంటలు చెలరేగే అవకాశం కూడా ఉందని, అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు ఇంతకుముందు కూడా చెలరేగాయని, కొన్నిసార్లు మంటలు కూడా చెలరేగి భారీ నష్టాన్ని మిగిల్చాయని, అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed