Ed-tech platform: రూ.1,743 కోట్లు సేకరించిన 'ఫిజిక్స్ వాలా' ఎడ్ టెక్ కంపెనీ!

by Geesa Chandu |   ( Updated:2024-09-21 12:50:51.0  )
Ed-tech platform: రూ.1,743 కోట్లు సేకరించిన ఫిజిక్స్ వాలా ఎడ్ టెక్ కంపెనీ!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా(Physics Wallah) రూ.1,743 కోట్ల నిధులను సమీకరించింది. ఫిజిక్స్ వాలా సిరీస్ B నిధుల(B-Funding)లో రూ.1,743 కోట్లను సమీకరించింది.ప్రస్తుత కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి పెరిగింది.

ఫిజిక్స్ వాలా ప్రైవేట్ లిమిటెడ్ (PW)అనేది, భారత్ లోని అగ్ర ఆన్‌లైన్ ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్. ఈ కంపెనీ ప్రస్తుతం తన సిరీస్ B ఫండింగ్ రౌండ్‌ను ముగించింది. ఇందులో ఐఎన్ఆర్(INR) 1,743 కోట్లను సేకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ యొక్క పోస్ట్-మనీ వాల్యుయేషన్ ఆకట్టుకునే ఐఎన్ఆర్(INR) 23,500 కోట్లకు పెరిగింది. కంపెనీ మునుపటి విలువ ఐఎన్ఆర్ (INR) 8,000 కంటే 2.5 రెట్లు ఎక్కువ. హార్న్‌బిల్ క్యాపిటల్ నేతృత్వంలో ఫండింగ్ రౌండ్ లో 2.8 బిలియన్ డాలర్ల వద్ద ఈ ఫండ్స్ సమీకరించింది. జీఎస్వీ(GSV), వెస్ట్‌బ్రిడ్జ్‌, లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్‌ తదితర ఇన్వెస్టర్లు ఈ ఫండింగ్ రౌండ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే మాట్లాడుతూ.. "ఈ పెట్టుబడి విద్యను ప్రజాస్వామీకరించడానికి భారత్ లోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది అని ఆయన అన్నారు. మా కమిట్ మెంట్ కి ఇది నిదర్శనం కూడా" అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed