Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Jakkula Mamatha |
Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ క్రమంలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్‌మెంట్లలో(compartments) భక్తులు(Devotees) వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.25 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్(Time slot) ఎస్‌ఎస్‌డీ దర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తుంది. ఇదిలా ఉంటే సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన(prescribed) సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ(TTD) విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్‌లో అనుమతించారని తెలుపుతున్నారు.

Next Story

Most Viewed