Finance Minister: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ

by Mahesh |
Finance Minister: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం 15 వేల కోట్లు కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాలని ఒకేలా చూడకుండా ఏపీకి ఎక్కువ నిధులు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కోసమే.. భారీ నిధులు కేటాయించారని ఇండియా కూటమి నేతలు ప్రత్యక్ష్యంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అన్ని బడ్జెట్‌లలో మాదిరిగానే రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించారు. ఏ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. కానీ 2024 విభజన చట్టం ప్రకారం ఏపీకి కొత్త రాజధాని నిర్మాణం కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రత్యేక నిధులు కేటాయించాము. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడం చేత దానిని వేగంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed