The boys are all in Fire.. పవన్ ‘OG’ నుంచి అదిరిపోయే అప్డేట్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-18 07:14:48.0  )
The boys are all in Fire.. పవన్ ‘OG’ నుంచి అదిరిపోయే అప్డేట్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’( OG). ప్రియాంకా ఆరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో శ్రియా రెడ్డి కీల‌క పాత్రలో అలరించనుంది. కాగా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఎన్నికల కారణంగా గతేడాది ఈ మూవీ చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా అని పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆఫ్టర్ ఎ ల్యాంగ్ గ్యాప్ త‌రువాత OG టీమ్ షూటింగ్ మూడ్‌లోకి వ‌చ్చేసింది. ‘బ్యాక్ టు OG’ అంటూ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కే చంద్రన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక షూట్ లొకేష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కే చంద్రన్, సుజిత్‌, త‌మ‌న్ వ‌ర్కింగ్‌లో ఉన్న పిక్స్‌ను చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ‘బాయ్స్‌ అంద‌రూ ఫైర్ మీద ఉన్నారు’ (The boys are all in Fire) అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మరి మీరు కూడా వీటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to dvv movies instagram id)

Advertisement

Next Story

Most Viewed