- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేత పట్టాభిపై హోం మంత్రి తానేటి వనిత సెటైర్లు..
దిశ, డైనమిక్ బ్యూరో: అబద్దాలకు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటాడో అలాగా ఉన్నాడు టీడీపీ నేత పట్టాభి అని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గెదే చెలో మెస్తే దూడ ఎక్కడ మేస్తుందో అలానే పట్టాభి వ్యవహారం ఉందని సెటైర్లు వేశారు. పట్టాభి తనపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ కోర్టులో ఆరోపణలు చేయడంపై హోంమంత్రి తానే వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ అనేది జరగలేదని కావాలనే ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
విజయవాడ క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. గన్నవరం విధ్వంసఘటనలో తలకు గాయాలు కావడంతో సీఐ కనకరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరామర్శించిన అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. పోలీసులపై దాడులను ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడం వల్లే అంతా ప్రశాంతంగా ఉన్నామని అలాంటి పోలీసులపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు.
40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదన్నారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనపర్తిలో ఉద్దేశపూర్వకంగా సభకు అనుమతులు లేకున్న పోలీసులను ఇబ్బందులు పెట్టడానికి మూర్ఖత్వంగా వ్యవహరించారని విరుచుకుపడ్డారు. అటు నారా లోకేశ్ సైతం ఉద్దేశపూర్వకంగానే స్టూల్ పై నిల్చుని మరీ సభలు నిర్వహిస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.