ఖైదీని కలిసేందుకు రూ.25 లక్షలు ఖర్చుపెట్టిన మాజీ సీఎం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఖైదీని కలిసేందుకు రూ.25 లక్షలు ఖర్చుపెట్టిన మాజీ సీఎం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హత్యాయత్నం కేసులో నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. పిన్నెల్లితో ములాఖత్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత.. పిన్నెల్లి ములాఖత్‌కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై రికార్డెడ్‌గా కేస్ నమోదైందని, 25 లక్షలు ఖర్చు పెట్టి ఖైదీని మాజీ సీఎం జగన్ పరామర్శించారని చెప్పారు. ములకత్‌కు టై అయిపోయినా మాజీ సీఎం అడగటంతో అనుమతిచ్చామన్నారు. గలాటా సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా ఆమె ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అట్రాసిటీ‌తో సహా 23 కేసులు పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ రెచ్చ కొడుతుందా అని నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Advertisement

Next Story