రాష్ట్రంలో భారీగా నమోదైన వర్షపాతం.. ఏ ప్రాంతంలో అధికంగా ఉందంటే..?

by Mahesh |   ( Updated:2024-08-31 14:21:32.0  )
రాష్ట్రంలో భారీగా నమోదైన వర్షపాతం.. ఏ ప్రాంతంలో అధికంగా ఉందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉపరితల ద్రోణి కారణంగా దాదాపు రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షపాతం నమోదును వాతావరణ శాఖ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా వీరులపాడు లో అత్యధికంగా 21 సెం.మీ, కంచికర్లలో 20.3 సెం.మీ, ఇబ్రహీంపట్నంలో 15.3 సెం.మీ, నందిగామలో 13.8 సెం.మీ, విజయవాడలో 13.5 సెం. మీ, గంపల‌గూడెంలో 13.1 సెం.మీ, చందర్లపాడలో 11 సెం.మీ, జగయ్యపేట, విసన్నపేటలో 8.3 సెం. మీ వర్షపాతం నమోదైంది. కాగా విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి మొత్తం నలుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బెజవాడ గుట్టకు ఆనుకుని ఉన్న నివాసాలలోని ప్రజలను అక్కడ నుంచి తరలిస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed