తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

by Satheesh |   ( Updated:2024-05-14 12:30:43.0  )
తాడిపత్రిలో యుద్ధ వాతావరణం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన.. వైసీపీ, టీడీపీ నేతల మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయాలు అయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. వందలాదిమంది టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణతో తాడిపత్రి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

Advertisement

Next Story