- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుపై 7 కేసులు.. సీబీఐకు అప్పగించాలన్న పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ కావడంతో పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులను సీబీఐకు అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. చంద్రబాబుపై ఉన్న కేసులను సీబీఐకు ఇవ్వాలన్న పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులను సీబీఐకు అప్పగించాలనడం సరికాదని వాదనలు వినిపించారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికి అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.