High Court:మెడికల్​ EWS కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-13 11:25:44.0  )
High Court:మెడికల్​ EWS కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) ఈ అంశం పై వాదోపవాదాలు జరిగాయి. పిటిషనర్ అడ్వకేట్ ఠాకూర్ మెడికల్ సీట్లను పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని వాదనలు వినిపించారు. వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల కేటాయింపు జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్లను పెంచకుండానే EWS కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ లాయర్ పేర్కొన్నారు. అయితే ఈ జీవో నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు..తదుపరి విచారణను వచ్చే 6 వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story