Nara Lokesh:ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తాం

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 08:58:57.0  )
Nara Lokesh:ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తాం
X

దిశ,వెబ్‌డెస్క్:దేశ వ్యాప్తంగా ఇటీవల భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) కేదార్‌నాథ్ లో చిక్కుకున్న దాదాపు 20 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తమకు అక్కడ భోజనం కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నమని..తమని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన పై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్(Nara Lokesh) ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ట్వీట్టర్ వేదికగా కేదార్ నాథ్‍లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను(Pilgrims) సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ(Uttarakhand Government) సహకారాన్ని కోరామని పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story