- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కుండపోత వర్షం.. దేవీపట్నం పోచమ్మ గుడిలోకి భారీగా చేరిన నీరు
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో చింతూరు ఎజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండరాజుపేట కాజ్ వే పై ఉధృతంగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయింది.
ఉమ్మడి గోదావరి జిల్లాలోనూ భారీ వర్షం పడుతున్నారు. అన్నవరంలోనూ భారీగా వాన కురవడంతో కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జిల్లాలో పలు చోట్ల రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి వాన కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దేవరపల్లి ఎస్బీఐ బ్యాంకులోకి మూడు అడుగుల మేర నీళ్లు చేరాయి.
అటు రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవీపట్నం గండిపోచమ్మ దేవస్థానం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అమ్మవారి వడి కట్టు వరకూ నీళ్లు చేరాయి. గోదావరి వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. దీంతో పాపికొండల్లో బోటింగ్‌ను నిలిపివేశారు.