Weather: ఏపీకి భారీ వర్ష సూచన

by srinivas |   ( Updated:2023-03-16 11:52:23.0  )
Weather: ఏపీకి భారీ వర్ష సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఇప్పుడు అది దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు తీర ప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఈ క్రమంలో ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈదురుగాలులు కూడా వేగంగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈదురు గాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

‘శనివారం కూడా ..!

‘శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోనూ శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.’ అని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story